రాయదుర్గం: పట్టణంలో కోట్ల రూపాయల సిమెంటు రోడ్డును ధ్వంసం చేస్తున్న ఎయిర్ టెల్ సంస్థ కాంట్రాక్టర్లు
రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలి నుంచి తేరు బజార్ వరకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేసిన సిమెంటు రోడ్డును ఎయిర్టెల్ నెట్వర్క్ సంస్థ కాంట్రాక్టర్లు అనుమతులు లేకుండా తవ్వేస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే భారీ యంత్రాలతో రోడ్డును కోతలు కోసి, భారీ గుంతలు తవ్వి కేబుళ్లు వేస్తున్నారు. ఎంతో పకడ్బందీగా నిర్మించిన సిమెంటు రోడ్డు ఇలా ద్వంసం చేస్తుండం పై పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటంతో పాటు రోడ్డు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.