యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో పల్లె పండుగ 3.0లో భాగంగా తారు రోడ్డుకు శంకుస్థాపన చేసిన టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగా పాలెం నరసాయపాలెం పంచాయతీలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా తారు రోడ్డు నిర్మాణానికి టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 26.40 కోట్ల నిధులతో సిసి రోడ్లు తారు రోడ్లు నిర్మాణం చేపడుతున్నామన్నారు.