రాయదుర్గం: 108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం
గుమ్మగట్ట మండలం ఆర్. కొత్తపల్లి గ్రామానికి చెందిన 7 నెలల గర్భిణీ కవిత 108 అంబులెన్స్ లో ప్రసవించింది. గురువారం ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడ కాన్పు చేయలేమని, బళ్ళారి వెళ్లాలని వైద్యులు సూచించడంతో 108 అంబులెన్స్ లో బళ్ళారి కి తరలించారు. అయితే మార్గమధ్యలో హొసగుడ్డం సమీపంలో కవిత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్ లో ఉన్న ఈఎంటి తేజశ్విని, ఫైలెట్ కేడిమి మహేష్ చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా కాన్పు జరిగేలా చర్యలు తీసుకున్నారు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.