గిద్దలూరు: బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి కిషన్ కు కన్నీటి వీడ్కోలు, హాజరైన ఎస్పీ, కలెక్టర్
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ హవల్దార్ కొవ్వరపు కిషన్ కు గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన కిషన్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అంత్యక్రియల కోసం అధికారులు కిషన్ స్వగ్రామమైన పందిళ్ళపల్లి గ్రామంలోని ఎస్సీ పాలెం కు తరలించారు. నేడు గ్రామంలో కిషన్ అంత్యక్రియలు పూర్తి చేశారు. కిషన్ భౌతిక కాయానికి ఎస్పి పంకజ్ కుమార్ మీనా, కలెక్టర్ విజయ సునీత నివాళులు అర్పించారు. అనంతరం కిషన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.