ఉరవకొండ: శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో మాస శివరాత్రి పూజా కార్యక్రమాలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి మాస శివరాత్రి పూజా కార్యక్రమాలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాస శివరాత్రి పూజల్లో భాగంగా స్వామి వారికి పంచామృతాభిషేకలను నిర్వహించి పుష్పాలంకరణ సేవలను నిర్వహించారు. మాస శివరాత్రి పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద దాతలు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు.