కనిగిరి: భైరవకోనలో వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ లలితా దేవి ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తుండగా, ప్రత్యేక పూజలు, హోమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.