రాప్తాడు: కనగానపల్లి లో ప్రభుత్వ పాఠశాల సమస్యలపై ఎమ్మార్వోకు వినీత పత్రం ఇచ్చిన సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి మహాదేవ
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కనగానపల్లి మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల సమస్యలపై ఎమ్మార్వో కు సిపిఐ నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి మహదేవయ్య సిపిఐ మండల కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ కన్నగానిపల్లి మండల వ్యాప్తికంగా శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలను మరమ్మతులన్నా చేయాలని లేదా తొలగించి నూతన గదులు నిర్మించాలని అదేవిధంగా గ్రామాల్లో విద్యుత్తు లైట్లు లేని వీధుల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని,ఈ సమస్యల పైన కనగానపల్లి ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చామని సిపిఐ మహాదేవయ్య బాలరాజు పేర్కొన్నారు.