కనిగిరి: యర్రగొండపాలెంలో ఉద్రిక్తత: నామినేషన్ కేంద్రం వద్ద TDP, YCP వర్గాల ఘర్షణ
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద నామినేషన్ల సందర్భంగా TDP, YCP వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.