గిద్దలూరు: బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడ్డ బొలెరో వాహనం, డ్రైవర్ కి గాయాలు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లా నుంచి మార్కాపురం వెళుతున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో రోడ్డుపై అరటి పండ్లు చెల్లాచెదురుగా పడగా డ్రైవర్‌కి గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు రోడ్డుపై అడ్డంగా పడిన వాహనాన్ని అరటి పండ్లను తొలగించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.