రాప్తాడు: శారద నగర్ శివకోటి శ్రీ పీఠంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ లలిత దేవి అమ్మవారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ శారద నగర్ వద్ద ఉన్న శివకోటి శ్రీ పీఠంలో గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు శివకోటి శ్రీ పీఠంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా లలితా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకుడు అమర్ ఆలయ ప్రధాన పూజారి అప్పు స్వామి మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ పీఠంలో శ్రీ లలితా దేవి అమ్మవారి అలంకరణ నిర్వహించి ప్రత్యేక హోమాలు పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తొమ్మిది రోజులు పాటు నిర్వహించే పూజల్లో భాగంగా గురువారం శ్రీ లలితా దేవి అలంకరణ నిర్వహించి పూజలు నిర్వహించామని అమర్, అప్పు స్వామి పేర్కొన్నారు.