సంతనూతలపాడు: చీమకుర్తి కాలువలో నిమజ్జనం కానీ గణేష్ విగ్రహాలు, భక్తుల ఆవేదన
చీమకుర్తి పట్టణంలోని నాగార్జునసాగర్- ఒంగోలు బ్రాంచ్ కెనాల్ లో ఇటీవల నిమజ్జనం చేసిన గణేష్ విగ్రహాలు నీటిపై తేలాడుతూ దర్శనమిస్తున్నాయి. కాలువలో నీటిమట్టం తగినంత లేకపోవడంతో విగ్రహాలు పూర్తిగా మనగకుండా ఇలా దర్శనమిస్తుండడంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు .ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాలు నీటిలో కరిగిపోకుండా అలానే ఉన్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే మట్టి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేసి ఉంటే, నీటి శాతం తక్కువగా ఉన్నప్పటికీ అవి త్వరగా మునిగి కరిగిపోతాయని అంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి, నిమజ్జనం చేయాలని కోరుతున్నారు.