రాప్తాడు: చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో దసరా పురస్కరించుకొని ఆయుధ పూజలు నిర్వహించిన ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో శనివారం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో దసరా పండుగను పురస్కరించుకొని సెలవులు సందర్భంగా జెఎన్టియు విశ్వవిద్యాలయంలో శనివారం రోజునే వాయిదా పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ దసరా సందర్భంగా సెలవులను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా యూనివర్సిటీలో నిత్యం ఉపయోగించే ఆయుధాలకు ఆయుధపూజ కార్యక్రమాన్ని నిర్వహించి యూనివర్సిటీ అభివృద్ధికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో ఉద్యోగులంతా పాల్గొన్నారు.