సంతనూతలపాడు: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ
చీమకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. వాతావరణ కాలుష్యం తగ్గించాలన్న, సకాలంలో వర్షాలు కురవాలన్నా పచ్చదనాన్ని పెంపొందించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.