కనిగిరి: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా నిర్మించిన మార్చురీ గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నూతనంగా నిర్మించిన మార్చురీ గదిని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్చురీ గదిలోని వసతులను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వ వైద్యశాలలో శిథిలావస్థకు చేరిన మార్చరీగది స్థానంలో నూతనంగా మార్చురీ గదిని నిర్మించడం జరిగిందన్నారు. మార్చురీ నిర్మాణంతో మృతదేహాలను భద్రపరచడంతో పాటు చనిపోయిన వారి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.