రాయదుర్గం పట్టణం బిటిపి లేఔట్ ఇప్పటి వరకు నిర్మాణాలు చేయని 189 ఇంటి పట్టాలు రద్దు చేసేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం నోటీసులు అతికించారు. ఇళ్ల నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదో వివరణతో కూడిన సంజయిసీ ఇస్తూ లబ్ధిదారులు లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, ఇంటి పట్టా పేపర్లతో బుధవారం తాసిల్దార్ కార్యాలయానికి రావాలని అందులో పేర్కొన్నారు. లేనియెడల పట్టాలు రద్దుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.