సంతనూతలపాడు: ఓటు హక్కును కాపాడుకునేందుకు నోటీసులతో చీమకుర్తి మున్సిపల్ కార్యాలయానికి క్యూ కట్టిన ఓటర్లు
చీమకుర్తిలో ఇటీవల ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఓటర్ల ప్రక్రియ లో ఓటును మ్యాపింగ్ చేయించుకోలేక పోయినవారు మరియు ఇతర తప్పులు ఉన్నవారికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమ ఓటు ఎక్కడ గల్లంతు అవుతుందోనన్ను అనుమానంతో ఓటర్లు నోటీసులతో సహా బుధవారం చీమకుర్తి మున్సిపల్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలో చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య, సిబ్బంది ఓటర్లకు వివరించి వారి అనుమానాలను నివృత్తి చేశారు.