రాయదుర్గం: అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం దర్నా
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలో సిపిఎం నాయకులు గురువారం పెద్ద ఎత్తున దర్నా చేపట్టారు. ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. పట్టణ శివారులోని సర్వేనంబర్ 156 లో వీరందరికీ పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున, నాగరాజు, మధు డిమాండ్ చేశారు. బాడుగ ఇళ్లలో ఉంటున్న పేదలు బాడుగలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.