కనిగిరి: కొండేపిలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను ఎస్పీ హర్షవర్ధన్ పరిశీలించారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసేలా తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని, శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారని తెలిపారు.