కొండపి: కొండపి పరిసర ప్రాంతాలలోని నేతల విగ్రహాలకు ముసుగులు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ ఫ్లెక్సీలు తొలగింపు
ప్రకాశం జిల్లా కొండపీ పరిసర ప్రాంతాలను రాజకీయ నాయకుల నేతల విగ్రహాలకు అధికారులు ముసుగులు తొడిగారు. ఈనెల 14వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ రావడంతో అధికారులు రాజకీయ ఫ్లెక్సీలు తొలగించారు. 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ 19వ తేదీ నామినేషన్ల పరిశీలన 21వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ర్యాలీలు లోడ్ స్పీకర్లు ఏర్పాటు చేయటం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం నిషేధమని అధికారులు నేతలను హెచ్చరిస్తున్నారు.