ప్రకాశం జిల్లా కంభం, బేస్తవారిపేట పరిసర ప్రాంతాలలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి సందర్శించారు. తుఫాను సందర్భంగా పంటలో నష్టపోయిన రైతులకు నష్టం పై అంచనావేసి ప్రభుత్వానికి పంపించిన అనంతరం వారికి నష్టపరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ తెలిపారు. కంభం చెరువు ప్రాంతాన్ని పరిశీలించి కంభం చెరువును అభివృద్ధి చేస్తామన్నారు.