రాయదుర్గం: పట్టణంలో ఆటో డ్రైవర్ల మద్య గొడవ, ఒకరి పరిస్థితి విషమం
ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య జరిగిన గొడవలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. 74 ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానప్ప, సలీమ్‌కు ఆటో విక్రయించగా డబ్బు చెల్లించకపోవడంతో తిరిగి ఆటో తెచ్చుకున్నాడు. బుధవారం ఉదయం రాయదుర్గం పట్టణంలో ఓబులాచారి రోడ్డులో మద్దానప్ప టీ తాగుతుండగా సలీమ్ వచ్చి బ్లేడుతో చెవి కోసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో ఉండగా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంకు తరలించారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.