కొండపి: జరుగుమల్లిలోని బీసీ హాస్టల్ విద్యార్థి లైంగిక దాడి ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్
ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కొన్ని బాలికపై ఒంగోలులో లైంగిక దాడి జరిగిన ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి డిమాండ్ చేశారు. కలెక్టర్ రాజాబాబు ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అందుకు బాధ్యుడైన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. అలానే అందుకు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.