రాప్తాడు: అనంతపురంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ముక్తాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీ నేతలు టిడిపి పార్టీలోకి చేరిక
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంప్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ముక్తాపురం గ్రామానికి చెందిన సుధాకర్ వారి అనుచరులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపి పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ముక్తాపురం గ్రామానికి చెందిన సుధాకర్ వారి అనుచరులు 25 కుటుంబాలు వారి కుటుంబ సభ్యులంతా కూడా నేడు టిడిపి పార్టీలోకి చేరడం జరిగిందని భవిష్యత్తులో వారికి పార్టీ పదవులు వచ్చేందుకు తన వంతు సహకారం ఎప్పుడూ అందిస్తానని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.