సంతనూతలపాడు: మద్దిపాడు మండలం చాకలి పాలెం లో పెన్షన్లను పంపిణీ చేసిన కలెక్టర్ రాజాబాబు
మద్దిపాడు మండలంలోని చాకలి పాలెం లో కలెక్టర్ రాజాబాబు సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి గురువారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లిన కలెక్టర్, ఎమ్మెల్యే వారిని కలిసి ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ నగదును స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నూతన పెన్షన్ల కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా దశలవారీగా పెన్షన్లు అందివ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.