గిద్దలూరు: మార్కాపురం, ప్రకాశం జిల్లాలో పలు లాడ్జిలను తనిఖీ చేసిన పోలీసులు, అనుమానస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వాలని వెల్లడి
మార్కాపురం, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం పోలీసులు పలు లాడ్జిలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి గదులను అద్దెక్కించే సమయంలో అద్దెకు ఇచ్చే వారి పూర్తి వివరాలను సేకరించాలని లాడ్జిల నిర్వహణ వారికి పోలీసులు సూచించారు. నేరాలు చేసేవారికి గదులను అద్దెకు ఇస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా అనుమానస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్వాహకులకు తెలిపారు.