గిద్దలూరు: గిద్దలూరులో తీవ్ర నీటి ఎద్దడి: ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
గిద్దలూరు మున్సిపాలిటీలో భూగర్భ జలాలు తగ్గడంతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ రమణబాబు ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.