సంతనూతలపాడు: చీమకుర్తి మండలం ఏలూరు వారి పాలెం శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో చోరీ
చీమకుర్తి మండలం ఏలూరు వారి పాలెం లోని శివారులో ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు దొంగలు ఆలయం ప్రధాన ద్వారం తలుపులు పగలగొట్టి లోపల హుండీలోని రూ .10 వేలు నగదు దోచుకెళ్ళినట్లు ఆలయ అర్చకులు హరి ప్రసాద్ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగి ఉండవచ్చని, బుధవారం ఉదయం ఆలయానికి వచ్చి చూసేసరికి హుండీలోని నగదు చోరీకి గురైనట్లు గుర్తించినట్లు ఆలయ అర్చకుడు తెలిపారు.