గిద్దలూరు: కొమరోలు మండలంలో ఆగస్టు 23వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఆగస్టు 23వ తేదీ ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా కొమరోలు మండలంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు ప్రజలకు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.