గిద్దలూరు: రాచర్ల మండలంలో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి, సత్య వోలు గ్రామాలలో బుధవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇంటి వద్దనే ఎమ్మెల్యే పెన్షన్లు అందజేశారు. ప్రతినెల 1వ తేదీ కల్లా ప్రభుత్వం ఇంటి వద్దనే లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తుందని అన్నారు. కుటుంబ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు.