రాయదుర్గం: హెచ్ఎల్సీ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని గోనేహాల్ వద్ద వేలాది మంది రైతుల ధర్నా
కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లోని హెచ్ఎల్సీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బొమ్మనహాల్ మండలం గోనేహాల్ వద్ద వేలాది మంది రైతులు రోడ్డెక్కారు. వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మెట్టు విశ్వనాథ్ రెడ్డి, ఉషారాణి, రైతు విభాగం అధ్యక్షులు గరుడచేడు గోపాల్ రెడ్డి తో పాటు పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు. ముందుగా హెచ్ఎల్సీ ప్రధాన కాలువలో జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రైతులు వరి నార్లు చేతబట్టి బళ్లారి - గుండ్లపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు.