గిద్దలూరు: తాటిరెడ్డిపల్లిలో ప్రజా సమస్యల పరిశీలన: త్వరలో పరిష్కరిస్తామన్న సొసైటీ చైర్మన్
కొమరోలు మండలం తాటిరెడ్డిపల్లిలో నేడు సొసైటీ చైర్మన్ ముత్తుముల సంజీవరెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలోని నీటి సమస్య, వీధి దీపాలు మరియు ఇతర సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.