యర్రగొండపాలెం: నరసాయపాలెం గ్రామంలో స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా పరిసరాల శుభ్రం చేసిన టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నరసాయపాలెం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం నిర్వహిస్తున్న స్వచ్ఛపదం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రోడ్లు స్వయంగా చీపురుతో శుభ్రం చేస్తూ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాదిని ప్రతి ఒక్కరూ తమ పరిసరాల పరిశుభ్రతను బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.