యర్రగొండపాలెం: కురిచేడు మండలం పలు గ్రామాలలో శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్ఐ కోటయ్య
ప్రకాశం జిల్లా కుడిచేడు మండలం దేకనకొండ మర్లపాలెం గ్రామాలలో ఎస్సై కోటయ్య సందర్శించారు. గత ఎన్నికల్లో ఏదైనా గొడవలు జరిగాయా అన్న విషయంపై స్థానికుల నుంచి ఆరా తీశారు. ఎలక్షన్ సమయంలో ఎవరైనా గొడవలు రెచ్చగొట్టే పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.