రాయదుర్గం: దొరికిన బంగారం గాజును అసలు యజమానికి అప్పగించినట్లు తెలిపిన సిఐ దేవానంద్
రాయదుర్గం పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బాలుడికి దొరికిన బంగారు గాజును దాని అసలు యజమానికి అప్పగించినట్లు రాయదుర్గం అర్బన్ సీఐ దేవానంద్ తెలిపారు. శనివారం ఓ బాలుడికి దొరికిన గోల్డ్ బ్యాంగిల్ను పోలీసులకు అప్పగించగా, దాని యజమాని రెండవ గాజుతో పోలీసు స్టేషన్ కు చేరుకుని ఆ గాజు తమదేనని గుర్తించాడు. నిర్ధారణ అనంతరం అతనికి అప్పగించినట్లు సిఐ తెలిపారు. బాధితుడు పోలీసులకు, బాలుడికి కృతజ్ఞతలు తెలిపాడు.