రాయదుర్గం: లయన్స్ క్లబ్ ఆఫ్ రాయదుర్గం నూతన అధ్యక్షుడిగా తాయి శ్రీనివాసులు ఎన్నిక
లయన్స్ క్లబ్ ఆఫ్ రాయదుర్గం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా లయన్ తాయి శ్రీనివాసులు, కార్యదర్శిగా పొరాళ్ల ధనార్దూన, కోశాధికారిగా పేర్మి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా SLV శ్రీనివాసులు, ఉమామహేశ్వరావు ఎన్నికయ్యారు. 25 ఏళ్లలో 5 వేలకు పైగా ఉచిత కంటి ఆపరేషన్లు, వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సేవలను మరింత విస్తృతంగా చేపడతామని నూతన అధ్యక్షులు తెలిపారు.