దర్శి: దొనకొండ మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న బ్రిటిష్ కాలం ఎయిర్ పోర్ట్
Darsi, Prakasam | Aug 23, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలో బ్రిటీష్ కాలం నాటి ఎయిర్పోర్టు శిథిలావస్థకు చేరుకుంది. 1934లో బ్రిటిష్ ప్రభుత్వం 136 ఎకరాల విస్తీర్ణంలో యుద్ధ విమానాలకు ఇంధనం నింపే సైనిక కేంద్రంగా ఏర్పాటు చేశారు. స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల పాటు కొన్నాళ్లు వాడుకోలో ఉంది. అంతటి చరిత్ర కలిగిన ఏర్పోర్ట్ రన్వే పై నేడు పిచ్చి మొక్కలు మొలిచి భవనాలు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని స్థానికులు తెలిపారు.