సంతనూతలపాడు: బక్కిరెడ్డిపాలెం లో దారుణం, ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలెం లో గురువారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిరుపతయ్య (61) ఇంటివద్ద నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా అతనిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. అయితే వ్యక్తిగత కక్షలతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన తిరుపతయ్యను చికిత్స నిమిత్తం ఒంగోలుకు తరలించారు.