రాప్తాడు: కనగానపల్లి లో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో డిసిఎంఎస్సీ చైర్మన్ వెంకటేష్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు ఏపీఓ వెంకటేష్ నాయక్ తో కలిసి పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా హార్టికల్చర్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ నాయుడు నెట్టెం వెంకటేశులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో పల్లె పండగ 3.0 కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించామని డిసిఎంఎస్సీ చైర్మన్ వెంకటేష్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ తెలిపారు.