రాప్తాడు: రాప్తాడు టు అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ ఆవిర్భావ దినోత్సవం మహాత్మా గాంధీజీ జయంతిని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ లీలావతి ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ లీలావతి మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ జయంతి ఐసిడిఎస్ ఆవిర్వ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగిందని ఐసిడిఎస్ 1975వ సంవత్సరంలో స్థాపించడం జరిగిందని అప్పటి నుంచి నేటి వరకు 51 సంవత్సరాలు చేస్తుందని ఐసిడిఎస్ ఏర్పడినప్పుడు నుంచి ఇప్పటివరకు పిల్లల అభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ లీలావతి పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.