గిద్దలూరు: గిద్దలూరు పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షం, ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం, చల్లబడ్డ వాతావరణం
మార్కాపురం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో గురువారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు ప్రజలను వేధించాయి. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. ఈనెల 19వ తేదీ వరకు వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.