కొండపి: సింగరాయకొండ లోని నవోదయ పాఠశాల ముందు ఐదు రోజులుగా నిరసనకు దిగిన అనుమానస్పద మృతి చెందిన విద్యార్థి తల్లి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని ప్రైవేటు నవోదయ పాఠశాల ముందు ఆదివారం కనిగిరికి చెందిన విద్యార్థి తౌశిక్ విద్యార్థి తల్లి నిరసనకు దిగింది. ఈ సంవత్సరం జనవరి నెలలో విద్యార్థి పాఠశాలలో అనుమానస్పద మృతి చెందాడు. విచారించిన అధికారులు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నిర్ధారించారు. అయితే వార్డెన్ పాఠశాల యాజమాన్యం తన బిడ్డను చంపాయని ఆరోపిస్తూ తల్లి నిరసన కార్యక్రమానికి దిగింది. ఐదు రోజులుగా పాఠశాల ముందు నిరసన తెలుపుతుంది. అయితే అధికారులు కానీ పాఠశాల యాజమాన్యం కానీ స్పందించలేదు.