నారాయణపేట మండల పరిధిలోని బొమ్మను పాడు గ్రామం అభివృద్ధికి దూరంగా ఉందని సర్పంచుల కాలం ముగిసినందున గ్రామంలో ఎక్కడి చెత్త చెదారం మురికి కాలువలు అలాగే ఉంటున్నాయని గ్రామస్తులు వాపోవుచున్నారు. మురికి కాలువల వలన ఈగలు దోమలు పెరిగిపోయి అంటువ్యాధులకు ఆస్కారం ఉంటుందని అన్నారు. ఇకనైన సంబంధిత అధికారులు నాయకులు స్పందించి వెంటనే గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులు కోరుచున్నారు.