కనిగిరి: పట్టణంలో రూ.25 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో రూ.25 కోట్లతో హెచ్ఎఎం నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... హెచ్ ఏ ఎం నిధులతో చేపట్టే అభివృద్ధి పనులతో పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతగా జరిగేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.