కొండపి: ఒంగోలులో ఆకట్టుకున్న ఎడ్ల ప్రదర్శన, మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమ
ప్రకాశం: ఒంగోలులో బుధవారం ఎడ్ల ప్రదర్శన అందర్నీ విశేషంగా ఆకర్షించింది. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎడ్ల ప్రదర్శన అందర్నీ విశేషంగా ఆకర్షించింది. పట్టణంలో ఎడ్లను ర్యాలీగా నిర్వహించి ప్రదర్శించారు. ఎడ్ల అందాలను పలువురు కీర్తించారు.