గిద్దలూరు: గిద్దలూరు పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా
మార్కాపురం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్ ని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి క్రైమ్ రిపోర్ట్ పై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు అరికట్టే అంశంపై దృష్టి పెట్టామని ఎస్పీ అన్నారు. అతి త్వరలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాంతి భద్రతలపై దృష్టిపెట్టాలని పోలీసులు సిబ్బందికి సూచించినట్లు ఎస్పి అన్నారు. సాధారణ తనిఖీలలో భాగంగా తాను గిద్దలూరు కు వచ్చారని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు.