నారాయణపేట్: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది: రఘువీర్ యాదవ్ ఆగ్రహం
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ నేతల అరెస్టులపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, 15 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.