ఉరవకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థుల గెలిపే మనందరి లక్ష్యం: వైస్సార్సీపీ పీఏసీ సభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి బుధవారం జిల్లా కేంద్రంలోనితన తన క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక ఓటమిపాలనపై ఉరవకొండ నియోజకవర్గం లో ఉన్న వైస్సార్సీపీ ఎంపీపీలు, జడ్పీటీసీలు మండల కన్వీనర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశనిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే స్థానిక ఎన్నికల్లో మన ఉరవకొండ నియోజకవర్గం లో అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు తెలియజేశారు.