సంతనూతలపాడు: రాచర్లకు వెళ్ళు ఆర్ అండ్ బి రహదారిలో విపరీతంగా పెరిగిపోయి ప్రమాదభరితంగా మారిన చిల్ల చెట్లు, పట్టించుకోని అధికారులు
నాగులుప్పలపాడు నుండి రాచర్లకు వెళ్ళు ఆర్ అండ్ బి రహదారి లో విపరీతంగా చిల్ల చెట్లు పెరిగిపోయి రోడ్డుపైకి రావడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి. పెద్ద వాహనాలు ఈ రోడ్డుపై వస్తున్న క్రమంలో వాటికి సైడ్ ఇచ్చే క్రమంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని, ప్రమాదాల నివారణకు రోడ్డుపై విపరీతంగా పెరిగిపోయిన చిల్లచట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.