ఉరవకొండ: పట్టణ శివారులోని మైక్రో స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులోని మైక్రో స్టేషన్ వద్ద గురువారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వజ్రకరూరు మండల కేంద్రానికి చెందిన జైనుల్లా, మహబూబ్ బాషా, మహమ్మద్ రఫీ అనే ముగ్గురు ద్విచక్ర వాహనంలో ఉరవకొండలో కోర్టుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉరవకొండ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి సంబంధించి ఇతర పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.