కనిగిరి: రెట్టింపు నగదు ఇస్తామని మోసం చేసిన పాస్టర్ పై చర్యలు తీసుకోవాలి: సిపిఎం కనిగిరి కార్యదర్శి కేశవరావు
కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డులో ఉన్న వేద హోసన్న కృప సంస్థ పేరిట పాస్టర్ చేసిన రెట్టింపు నగదు స్కాం బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పి.సి. కేశవరావు డిమాండ్ చేశారు. కనిగిరిలోని సుందరయ్య భవనంలో శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షకు లక్ష, కోటికి కోటి ఇస్తామని ఏజెంట్ల ద్వారా ప్రచారం చేయించి, అమాయక ప్రజల నుండి కోట్లాది రూపాయలు కొల్లగొట్టడం దారుణమన్నారు. గడిచిన రెండేళ్లుగా సాగుతున్న ఈ మోసం మూడు రోజుల క్రితం బట్టబయలైందని, ప్రస్తుతం పోలీసులు పాస్టర్ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.